Relationship Issues: వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ప్రియురాలు.. బాడీబిల్డర్ ఏం చేశాడంటే?

  • వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ప్రియురాలు
  • బెంగళూరులో 26 ఏళ్ల బాడీబిల్డర్ ఆత్మహత్య
  • కిరణ్ గత మూడు సంవత్సరాలుగా ఓ యువతితో రిలేషన్ షిప్
Body Builder

Body Builder

అందరి ప్రేమలు పెళ్లి పీటలెక్కడం లేదు. దీనికి కారణం తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, కులమతాల అడ్డుగోడలు, పరువు ప్రతిష్టలు ఇలా చాలా ఉన్నాయి. దీంతో ప్రేమికులు ఒకరిని విడిచి ఉండలేక, కలిసి జీవించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక తనువులు చాలిస్తున్నారు. ఇదే రీతిలో బెంగుళూరులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాడీబిల్డర్ తన ప్రియురాలు వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో 26 ఏళ్ల బాడీబిల్డర్ తన ప్రేయసి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Also Read:75 HP పవర్‌, 750సీసీ లైనప్‌, 730సీసీ ట్విన్ ఇంజిన్‌తో Jawa 730 Twin త్వరలోనే లాంచ్

జిమ్ ట్రైనర్, బాడీబిల్డర్ అయిన కిరణ్ గత మూడు సంవత్సరాలుగా ఓ యువతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. శనివారం అతను తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ఆమె తన వివాహం వేరొకరితో నిశ్చయించబడిందని ప్రియుడితో చెప్పింది. దీంతో అతను కలత చెంది మహాలక్ష్మి లేఅవుట్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిరణ్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు.

Also Read:OTT Crisis : నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ న్యూరూల్స్.. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే ఆగిపోతున్న భారీ చిత్రాలు..

కిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో షాక్ కు గురయ్యారు. అర్థంతరంగా తనువు చాలించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కిరణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. కిరణ్ గదిలో లభించిన సూసైడ్ నోట్ సహా కేసుకు సంబంధించిన వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.