NTV Telugu Site icon

Bode Prasad: పెన్షన్ల పంపిణీపై నీచరాజకీయాలు.. జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరే వేదిక..!

Bode Prasad

Bode Prasad

Bode Prasad: కృష్ణాజిల్లాలో పెన్షన్ల పంపిణీపై వివాదం కొనసాగుతూనే ఉంది.. పెన్షన్‌ తీసుకోవడానికి వెళ్లి వడదెబ్బతో మృతిచెందారంటూ.. వారి కుటుంబ సభ్యులు చెబుతుండగా.. వాటిపై కూడా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు.. ఈ వ్యవహారంలో మంత్రి జోగి రమేష్‌ తీరును తప్పుబట్టారు పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్.. పెన్షన్ పంపిణీపై వైసీపీ నీచరాజకీయాలు చేస్తోందని మండిపడ్డా యాన.. జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరు వేదిక కాబోతోందని జోస్యం చెప్పారు. జోగి రమేష్ అధికార దాహం అనే మానసిక రోగం ఉంది.. వైసీపీ అధిష్టానం జోగి రమేష్ ను మూడు నియోజకవర్గాలు మార్చేసరికి అతని మానసిక పరిస్థితి దెబ్బతిందన్నారు. ఎక్కడ ఎప్పుడు శవం దొరుకుతుందా? రాజకీయం చేద్దామనే ఆలోచనతో జోగి రమేష్‌ ఉన్నాడు అంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: Fake Currency: బాలాపూర్లో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత .. నలుగురు అరెస్ట్

అసలు వజ్రమ్మ మృతికి కారణం ఎవరో వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారన్న ఆయన.. పెన్షన్‌ పంపిణీ చేయాల్సిన అధికారులు మూడుసార్లు సచివాలయానికి ఇంటికి వజ్రమ్మను తిప్పటంతో ఆమె చనిపోయిందన్నారు. అనోరోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దే పెన్షన్‌ ఇవ్వాలనే నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. వజ్రమ్మ చనిపోయిన విషయం తెలుసుకుని వేరే సచివాలయం నుంచి తీసుకొచ్చిన డబ్బులు పంపిణీ చేశారని మండిపడ్డారు బోడె ప్రసాద్. కాగా, పెన్షన్ల పంపిణీ చేపట్టిన తొలిరోజే.. పెన్షన్లను తీసుకోవడానికి వెళ్లి.. వడదెబ్బతో ఒకేరోజు నలుగురు మృతిచెందారు.. పెన్షన్ల పంపిణీలో జాప్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నవిషయం విదితమే.