NTV Telugu Site icon

Prakasam Barrage: ప్లాన్ సక్సెస్‌.. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతం

Prakasam Barrage

Prakasam Barrage

Boat Removal Operation Success At Prakasam Barrage: ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఓ భారీ బోటును బయటకు తీయగలిగారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న 40 టన్నుల బరువున్న భారీ బోటును బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. H బ్లాక్‌ ఆపరేషన్ పద్ధతి ద్వారా మొదటి బోటును ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. బోట్ల సాయంతో నీటిలో చిక్కుకున్న బోటును ఒడ్డుకు తరలించే ప్రక్రియలో ఇంజనీర్లు పురోగతి సాధించారు.

Read Also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చ

ఇప్పటివరకు 4 రకాల ప్లాన్లతో శతవిధాలుగా ప్రయత్నించినా నిరాశే ఎదురుకాగా.. 5వసారి సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన ఓ భారీ బోటును ఒడ్డుకు చేర్చారు. డ్రెడ్జింగ్ చేసే రెండు భారీ బోట్లకు గడ్డర్లను అమర్చి చిక్కుకున్న పడవను ఒడ్డుకు తరలించారు. బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను ఇంజినీర్లు కొనసాగించనున్నారు. గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ బోట్‌ను పున్నమి ఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు. బ్యారేజీ ఎగువన కిలోమీటర్‌ పైగా దూరంలో పున్నమి ఘాట్‌లో ఆ బోట్‌ను ఉంచారు. బోట్‌ను విజయవంతంగా వెలికితీసిన సిబ్బందిన మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. బ్యారేజ్‌కు నష్టం వాటిల్లకుండా 8 రోజుల నుంచి చేస్తున్న కృషి ఫలించిందన్నారు. మిగిలిన రెండు బోట్లను కూడా వెలికి తీస్తామని మంత్రి తెలిపారు.

 

Show comments