NTV Telugu Site icon

Boat Storm Infinity: 15 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. తక్కువ ధరకే

Boat

Boat

ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థ బోట్ కొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. ఇది 15 రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇది HD డిస్ప్లేను కలిగి ఉంది. IP68 రేటింగ్ దీనిని దుమ్ము, స్ప్లాష్‌ల నుండి రక్షిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి ట్రాకర్లు వంటి అనేక హెల్త్ ట్రాకర్ ఫీచర్లను కలిగి ఉంది.

Also Read:YouTube: మ్యూజిక్ లవర్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన యూట్యూబ్!

బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర

బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,299. ఇది యాక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, బ్రౌన్, డీప్ బ్లూ, జాడే గోల్డ్, సిల్వర్ మిస్ట్, స్పోర్ట్స్ బ్లాక్, స్పోర్ట్స్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని Amazon.in, Flipkart, boat-lifestyle.com నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను 240×284 పిక్సెల్‌ల రిజల్యూషన్ తో వస్తుంది.

Also Read:CM Yogi Adityanath: ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించింది..

ఫ్లిక్-టు-వేక్ గెశ్చర్ ఆప్షన్ తో వస్తుంది. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీలో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇన్ బిల్ట్ వాయిస్ అసిస్టెంట్‌తో వాచ్‌లో హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్ కూడా సాధ్యమే. దీనితో పాటు అలారం, స్టాప్‌వాచ్, వెథర్ అప్ డేట్స్, ఫ్లాష్‌లైట్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్, ఆటలు, క్యాలెండర్, కాలిక్యులేటర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.