BMW M4 CS Price: బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్ లాంచ్.. ధర రూ.1.89 కోట్లు!
- బీఎండబ్ల్యూ సరికొత్త కారు
- ధర రూ 1.89 కోట్లు
- టాప్ స్పీడ్ 302 కిమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW M4 CS Launch: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ సరికొత్త కారును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ‘ఎం4 సీఎస్’ పేరుతో కొత్త కారును రిలీజ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). భారత మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్ ఇదే కావడం విశేషం. సీఎస్ (కాంపిటీషన్ స్పోర్ట్) మోడల్ కంటే ఎం4 సీఎస్ ధర రూ. 36 లక్షలు ఎక్కువ. ఈ కారు డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే.. బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ కారు 3.0 లీటర్ ట్విన్ టర్బో స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 550 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో బూస్ట్ ప్రెజర్ 1.7 బార్ నుంచి 2.1 బార్‌కి పెంచడంతో.. పవర్ కాస్త ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారు 3.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఎం4 కంటే 0.1 సెకన్లు అధికం. ఇక టాప్ స్పీడ్ గంటకు 302 కిమీ. ఈ కారు ఆడి ఆర్ఎస్5కు గట్టి పోటీ దారుగా ఉంటుంది.
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
Also Read: Tata Nexon EV: బిగ్ బ్యాటరీతో టాటా నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 489కిమీ ప్రయాణం!
బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ కారులో టైటానియం ఎగ్జాస్ట్ సైలెన్సర్, సెంటర్ కన్సోల్, గేర్‌బాక్స్ ప్యాడిల్స్ వంటివి ఫైబర్‌తో వస్తాయి. ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్స్ ఉంటాయి. ఎల్లో కలర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్, కిడ్నీ గ్రిల్ బార్డర్ ఎరుపు రంగులో ఉంటుంది. 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్‌లోని సీఎస్ ఎరుపు రంగులో ఉంటుంది. ఎం కార్బన్ బకెట్ సీట్స్ ఉంటాయి. సెంటర్ కన్సోల్‌లో ఎరుపు రంగు సీఎస్ వర్డ్స్, ఎం సీట్ బెల్ట్‌లు, ఎం4 సీఎస్ డోర్ సిల్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..