బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపి హెల్త్‌కేర్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరచే దిశగా.. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BROEC) అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ముఖ్యమైన విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. అపోలో మెడ్‌స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఎంఓయు (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) పై బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సీఈఓ & ఫౌండర్ పబ్బా సంతోష్, అపోలో మెడ్‌స్కిల్స్ ప్రాతినిధ్యం వహించిన డా. శ్రీనివాస్ పి. CEO, చేతులు కలిపారు.
Kiren Rijiju: మిస్ ఇండియాలో దళితులు లేరు.. రాహుల్ గాంధీవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
17 ఏళ్ల అనుభవం కలిగిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్.. విద్య, శిక్షణ.. ప్లేస్‌మెంట్స్ రంగాలలో సమర్థవంతంగా 34 శాఖలను భారత్‌లో మరియు విదేశాలలో 11 శాఖలను నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జాయింట్ అకడమిక్ రీసెర్చ్, వర్క్‌షాప్‌లు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఇంటర్న్‌షిప్‌లు మరియు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు మరియు నిపుణులు లాభపడతారు.
Tollywood: సండే సూపర్ -6 టాలీవుడ్ స్పెషల్ న్యూస్..
ఇది హెల్త్‌కేర్ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను అందించడానికి, భారతీయ నిపుణులను అంతర్జాతీయ ఉత్తమ నైపుణ్యాలకు పరిచయం చేయడానికి దోహదపడుతుంది. BROEC అనుబంధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి అంకితభావంతో పనిచేస్తుంది.
