NTV Telugu Site icon

HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 02 18 At 2.16.57 Pm

Whatsapp Image 2024 02 18 At 2.16.57 Pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్‌కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ మరియు సినిమా షోస్ చూసిన ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఎంతగానో ప్రశంసించారు.ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తున్న హనుమాన్ చిత్రం ఓటీటీ విడుదల తేది ఆసక్తికరంగా మారింది. హనుమాన్ చిత్రం డిజిటల్ స్ట్కీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.ఇక ఇటీవలే హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై జీ5 సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ అయిన మూడు వారాల తర్వాత హనుమాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సి వుంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ రావడంతో థియేట్రికల్ రన్‌ను 55 రోజులకు పొడగించారు. 55 రోజుల తర్వాత జీ5 ఓటీటీలోకి హనుమాన్ మూవీని రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మార్చి రెండో వారంలో జీ5లో హనుమాన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ఓటీటీ సంస్థ ప్రకటించింది.అయితే, అప్పుడు హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. జీ5లో హనుమాన్ మూవీని మార్చి 2 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..

Show comments