Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్, భారత్‌ జోడో యాత్ర ట్విటర్ ఖాతాలను నిలిపేయండి.. కోర్టు ఆదేశం

Congress

Congress

Congress: కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు కోర్టు షాక్‌ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను ప్లే చేసినందుకు గాను ఒక సంగీత సంస్థ కాంగ్రెస్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేయడంతో బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విటర్‌ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది. భారత్‌ జోడో యాత్ర సమయంలో సూపర్‌హిట్‌ కన్నడ చిత్రం కేజీఎఫ్‌-2 నుంచి మ్యూజిక్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ ఆ సినిమాకు సంగీతాన్ని అందించిన ఎంఆర్‌టీ సంస్థ అధినేత ఎం.నవీన్‌కుమార్‌ రాహుల్‌గాంధీతో సహా ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులపై ఫిర్యాదు చేశారు.

కాపీరైట్‌, ఐపీసీ నిబంధన కింద రాహుల్‌ గాంధీతోపాటు, జైరామ్‌ రమేశ్‌, సుప్రియపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరు కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. జోడో యాత్రకు సంబంధించి జైరామ్‌ రమేశ్‌ రెండు వీడియోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారని.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా అందులో కేజీఎఫ్-2 సంగీతాన్ని వినియోగించారని నవీన్‌ కుమార్‌ కేసు వేశారు. భారత్ జోడో యాత్ర ప్రచార వీడియోలలో కేజీఎఫ్‌-2 పాటలు ఉన్నాయని మ్యూజిక్ కంపెనీ మేనేజర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ప్రచారానికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది.

Mehreen Pirzadaa: సముద్ర తీరాన సాగర కన్యలా దర్శనమిచ్చిందే

కోర్టు కార్యకలాపాల గురించి తమకు తెలియదని, ఆర్డర్ కాపీ తన వద్ద లేదని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఐఎన్‌సీ, బీజేవైఎస్‌ఎం హ్యాండిల్స్‌కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టు నుండి ప్రతికూల ఆర్డర్ గురించి తాము సోషల్ మీడియాలో చదివామని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర బీజేవై సోషల్ మీడియా హ్యాండిల్‌ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది.

 

Exit mobile version