NTV Telugu Site icon

Blast : క్వారీలో బ్లాస్టింగ్ ఇద్దరు మృతి.. రాళ్ళ గుట్టల్లో ఇరుక్కున్న మృతదేహాలు

Blast

Blast

కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రౌతులపూడి మండలం పైడిపాల క్వారీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. రాళ్లను పేల్చేందుదు క్వారీ నిర్వాహకులు పేలుడు పదార్థాలు అమర్చారు. అయితే.. అది తెలియని ఇద్దరు అటుగా వెళ్తుండగా బ్లాస్ట్‌ కావడంతో వారిపై పడ్డ రాళ్లు పడ్డాయి. రిగ్ బ్లాస్టింగ్ వల్ల రాళ్ళ గుట్టల్లో ఆ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఇరుక్కున్నాయి. అయితే.. సర్వే నెంబర్ 15లో జరిగిన ప్రమాదం జరిగింది. అనుమతులు లేకుండా క్వారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులు భార్యాభర్తలుగా గుర్తించి అధికారులు మృతదేహాల కోసం క్రేన్ తో రాళ్ళు తొలగిస్తున్నారు.

Also Read :AAP: జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ..

అగ్నిప్రమాదం.. దివ్యాంగురాలు మృతి..

విశాకపట్నంలోని సీతమ్మధార బిలాల కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్రిప్రమాదంలో దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయ్యప్ప స్వామి పూజ అనంతరం దీపం కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వృద్దురాలి(90)తో పాటు దివ్యాంగులైన యువతి(19), బాలుడు(15) ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ.. అప్పటికే దివ్యాంగురాలైన యువతి మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీఎచ్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments