NTV Telugu Site icon

Blade Attack: బ్లేడ్ తో దాడి చేసుకున్న విద్యార్థినులు.. వైరల్ వీడియో..

Blade Attack

Blade Attack

తాజాగా ఓ పాఠశాలలో కొందరు బాలికలు గొడవ పడుతున్న సమయంలో ఓ బాలిక ముఖంపై బ్లేడుతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్ టైప్-1 CO-ED సర్వోదయ పాఠశాలలో జరిగింది. ఈ వీడియోని గమనించినట్లయితే.. కొందరు విద్యార్థులు ఒకచోట గుంపుగా ఏర్పడి ఘర్షణ పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే అనుకోకుండా వీరి ఘర్షణలో ఓ అమ్మాయి మరో అమ్మాయి పై బ్లేడ్ తో దాడి చేసింది. అయితే ఈ దాడి జరిగిన సమయంలో విద్యార్థులు ఆ అమ్మాయి దాడి చేస్తున్నపుడు అడ్డుకోలేకపోయారు. దీంతో గాయపడిన అమ్మాయి ముఖంపై పెద్దగా రక్తం కారుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సమయంలో పాఠశాలలోని ఓ వ్యక్తి వారికి గొడవను వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో ఆశ్చర్యపోయాడు.

Also Read: Dry Ice: అయ్యయ్యో.. ఐస్ అనుకోని డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి..

ఇక ఈ విషయం సంబంధించి పాఠశాల పిల్లల తల్లిదండ్రులలో భయం, ఆందోళనలు రేకిత్తించాయి. ఈ సంఘటన నేపథ్యంలో పాఠశాలలోని భద్రత చర్యల లోపాలను తల్లిదండ్రులు ఎత్తిచూపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వేగంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకి సోషల్ మీడియా నెటిజన్స్ కూడా వారి స్పందనలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియో కు నార్త్ వెస్ట్ డిసిపి, అలాగే ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ గొడవ గల కారణం అలాగే పరిస్థితుల వివరాలు ఇంకా తెలియ రాలేదు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show comments