NTV Telugu Site icon

Black Magic: క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Black Magic Min

Black Magic Min

Black Magic: ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇకపోతే సినిమాలు, సీరియల్స్ లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా కొందరు క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్న సంగటనలు కూడా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. లేపాక్షి మండలంలోని మానేంపల్లి – జూమాకులపల్లి  గ్రామాల మధ్య రోడ్డు పైన పూజల ఆనవాళ్లు కనపడ్డాయి. అయితే., ఈనెల 2 న సమీప గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్జాడు. ఇందుకు సంబంధించి కొందరు పూజలు చేసి ఉంటారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

PM KISAN: రైతులకు శుభవార్త.. ఆరోజే పిఎం కిసాన్ 18వ విడత డబ్బులు అకౌంట్లలోకి..

కాకపోతే, ఆ పూజా విధానం క్షుద్ర పూజలు తరహా ఉండటంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. విషయం బయటకు రావడంతో అక్కడి పరిస్థితిని శుభ్రం చేసారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show comments