PM KISAN 18th installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకం 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. ఈ వాయిదా 5 అక్టోబర్ 2024న విడుదల చేయబడుతుంది. ఈ సమాచారం PM కిసాన్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది. ఇదివరకు, 17వ విడతను జూన్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. జూన్ 18, 2024న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 9.26 కోట్ల మంది రైతులకు 17వ విడతగా రూ. 21,000 కోట్లకు పైగా ప్రధాని మోడీ విడుదల చేశారు. 16వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది.
KBC 16: రూ.7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్ తెలిసినా.. రూ. కోటితో నిష్క్రమించిన 22 ఏళ్ల కుర్రాడు..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000, అంటే సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఏప్రిల్ – జూలై, ఆగస్టు – నవంబర్, డిసెంబర్ – మార్చి ఇలా మూడు వాయిదాలలో మొత్తం ఇవ్వబడుతుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తారు. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
Israel Attacks On Lebanon: లెబనాన్‌లో ఉద్రిక్తత.. భారత పౌరులు వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలంటూ.!
లబ్ధిదారులు తమ స్థితిని ఇలా తనిఖీ చేసుకోవచ్చు..
* మొదట pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి., అక్కడ ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
* అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ‘డేటా పొందండి’ ఎంపికను ఎంచుకోండి. అక్కడ మీ స్థితి కనిపిస్తుంది.
Bank Locker: బ్యాంక్ లాకర్‌ను తెరవాలనుకుంటున్నారా.? అయితే ఈ నియమాలు తెలుసుకోవాల్సిందే!
లబ్ధిదారుల జాబితాలో పేరును ఇలా తనిఖీ చేయండి..
* PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inకి వెళ్లి., ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
* అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామాన్ని ఎంచుకోండి. ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయండి. దీని తర్వాత లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
* మరింత సమాచారం కోసం, హెల్ప్‌లైన్ నంబర్ 155261 మరియు 011-24300606లను సంప్రదించండి.
Gold Limit in Home: ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకో వచ్చో తెలుసా? నియమాలు ఏం చెబుతున్నాయంటే..?
PM కిసాన్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి.?
* pmkisan.gov.in ని సందర్శించి., ‘కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
* PM కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అవసరమైన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేయండి.
* ఇంకా భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి. ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.