NTV Telugu Site icon

Russian plane crash: కూలిన రష్యా సైనిక విమానం.. బ్లాక్ బాక్స్ స్వాధీనం..!

Russian

Russian

రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే, ఉక్రెయిన్‌ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలిన ప్రాంతంలో దర్యాప్తు బృందానికి బ్లాక్‌బాక్స్‌ దొరికింది. ఈ ఘటనలో సిబ్బంది సహా 74 మందితో వెళ్తున్న విమానం బుధవారం నాడు ఒక్కసారిగా కుప్పకూలిన దుర్ఘటనలో అందరూ చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఖైదీల మార్పిడిలో భాగంగా 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలతో తాము విమానంలో వెళ్తుండగా రెండు క్షిపణులతో కీవ్‌ కూల్చి వేసిందని రష్యా ఆరోపణలు చేసింది.

Read Also: Nara Bhuvaneshwari: నేటితో ముగియనున్న నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన!

ఇక, ఇది వట్టి ప్రచారమే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఆ విమానంలో ఉన్నవారి గురించి తమకు సమాచారం లేదని చెప్పారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై తాము అంతర్జాతీయ దర్యాప్తు కోసం ఒత్తిడి తెస్తామని చెప్పారు. రష్యా భూభాగంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను జెలెన్ స్కీ విడుదల చేశారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధి రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లవ్రోవ్‌ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాడు.