Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
- ఒకప్పుడు పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్, ఇప్పుడు పాక్ సైన్యానికే సవాల్..
- బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధిపతిగా రెహ్మాన్ గుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan BLA: పాకిస్తాన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA)ని తిరుగుబాటు చేస్తోంది. పాక్ ప్రభుత్వం తమ ప్రాంతంపై పాల్పడుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం పొందేందుకు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదిలా ఉంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా సీనియర్ కమాండర్ రెహ్మాన్ గుల్ అలియాస్ మురీద్ నియమితులయ్యారు. గతంలో పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసిన ఆయన.. 8 ఏళ్ల సర్వీస్ తర్వాత 2010లో తిరుగుబాటు బీఎల్ఏలో చేరారు. ఇప్పటి వరకు బీఎల్ఏ ఆర్మీలో కీలక సైనిక విభాగమైన మజీద్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు.
బీఎల్ఏ విడుదల చేసిన ప్రకటనలో.. సంస్థ సీనియర్ కమాండ్ కౌన్సిల్ సభ్యులు, కమాండర్లతో చర్చించిన తర్వాత రెహ్మాన్ గుల్‌ను కొత్త అధినేతగా ఎంపిక చేశారు. ఈ నియామకం పూర్తిగా ఏకగ్రీవంగా జరిగినట్లు బీఎల్ఏ ప్రకటించింది. రెహ్మాన్ గుల్ గతంలో సీనియర్ కమాండ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు. సంస్థలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం గుల్కు ఉందని బీఎల్ఏ పేర్కొంది. కొత్త నాయకత్వం తమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాయని ప్రకటించింది.
Also Read
- US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
- Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
బషీర్ జెబ్ స్థానంలో రెహ్మాన్ గుల్..
బీఎల్‌లో ఇటీవల నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 3న బషీర్ జెబ్ బలూచ్ ఇకపై కమాండర్-ఇన్-చీఫ్ బాధ్యతల్లో ఉండరని బీఎల్ఏ ప్రకటించింది. ఇప్పుడు ఈ స్థానంలో రెహ్మాన్ గుల్‌ను తీసుకువచ్చారు. 2018 డిసెంబర్లో అస్లాం బలూచ్ మరణం తర్వాత బషీర్ జెబ్ సంస్థ పగ్గాలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అస్లాం బలూచ్ మరణించారు. ఆ తర్వాత బషీర్ జెబ్ నేతృత్వంలోని బీఎల్ఏ పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులపై విస్తృతమైన దాడులు చేసింది. 2018లో కరాచీలోని చైనా కాన్సులేట్‌పై దాడి, 2019లో గ్వాదర్‌లోని పెర్ల్ కాంటినెంటల్ హోటల్‌పై దాడి, 2020లో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్పై దాడి ఉన్నాయి. 2025 మార్చిలో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాకింగ్ ఘటనకు కూడా బీఎల్ఏ బాధ్యత ప్రకటించింది.
పాక్ సైన్యంలో పనిచేసి, ఇప్పుడు అదే సైన్యానికి సవాల్..
రెహ్మాన్ గుల్ బీఎల్ఏలో కీలక కమాండర్‌గా గుర్తింపు పొందారు. పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన అనుభవం ఉండటంతో పాక్ సైన్యం పనితీరు, ఆపరేషన్స్‌పై అవగాహన ఉంది. దీంతో బీఎల్ఏకు చెందిన ప్రమాదకర మజీద్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించి అనేక డెడ్లీ అటాక్స్ నిర్వహించారు. గతంలో పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్ హోదాలో పనిచేశారు. పాక్ సైన్యాన్ని వీడి బీఎల్ఏలో 2010లో చేరారు. ఆగస్టు 14 ,1984లో బలూచిస్తాన్‌లోని నౌష్కీ ప్రాంతంలో గుల్ జన్మించారు. 2002లో పాకిస్థాన్ సైన్యంలో చేరిన ఆయన.. 19 ఫ్రంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో సుమారు ఎనిమిదేళ్లు పనిచేశారు. పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ, కాకుల్లో రెండేళ్లపాటు శిక్షణ పొందారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
-
Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
-
US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
Warangal Fake Doctors : పెద్ద ఆసుపత్రుల్లో బిల్లుల బాదుడు.. చిన్న క్లినిక్‌లలో నకిలీ వైద్యులు.!
-
AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!