Site icon NTV Telugu

AP BJP : నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు

Purandeshwari

Purandeshwari

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలిగా నియమించిననాటి నుంచి వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పురంధేశ్వరి కూడా పాల్గొగనున్నారు. పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని పురంధేశ్వరి నిర్ణయించారు. ఈ జోనల్ సమావేశాలు ముగిశాక కొత్త కమిటీలు ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన గుంటూరులో కొస్తాంధ్ర జోన్ సమావేశం జరగనుండగా.. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.

Also Read : Ashish Kumar Yadav: సీఎంను కలిసిన ఆశిష్ కుమార్ యాదవ్.. గోషామహల్ సమస్యలపై వివరణ

కాగా వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని పురంధేశ్వరి ధ్వజమెత్తారు. కార్పొరేషన్‌ ల పేరుతో తెచ్చిన అప్పులు.. కార్పొరేషన్‌ లకు కేటాయించడం లేదన్న ఆమె.. పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులకు వడ్డీలు కట్టడంతోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని దుయ్యబట్టారు. అప్పులు చేసి సంపద సృష్టించే ఒక్క నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Also Read : Ashish Kumar Yadav: సీఎంను కలిసిన ఆశిష్ కుమార్ యాదవ్.. గోషామహల్ సమస్యలపై వివరణ

Exit mobile version