Lalu Prasad Yadav: బిహార్‌లో బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు, న్యాయపరమైన సమస్యలతో చాలా కాలం పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తేలిగ్గా తీసిపారేశారు. బీజేపీ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం పూర్నియాలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా లాలూ నేతృత్వంలోని ఆర్జేడీపైన, నితీశ్ నేతృత్వంలోని జేడీయూపై చేసిన వ్యాఖ్యలపై లాలూను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ విధంగా స్పందించారు.
దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవించి, అనేక అనారోగ్య సమస్యలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న లాలూ యాదవ్ ఢిల్లీకి వెళ్లే ముందు విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఆందోళన అక్కర్లేదు.. త్వరలోనే బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది అని తేలికగా సమాధానమిచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ రేపు ఢిల్లీలో నితీశ్‌కుమార్‌తో కలిసి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. విపక్షాల ఐక్యత కోసం తాము చేయాల్సిన ప్రయత్నమంతా చేస్తామని, తమ సమావేశం ప్రధాన ఎజెండా కూడా అదేనని లాలూ చెప్పారు.
Ankita Bhandari Case: నన్ను వ్యభిచారిణిగా మార్చేందుకే.. హత్యకు ముందు చాటింగ్‌లో యువతి
బిహార్ సీఎం నితీష్ కుమార్, తన కుమారుడు తేజస్వి యాదవ్‌తో కలిసి లాలూప్రసాద్ యాదవ్ హర్యానాలో జరిగే ర్యాలీకి కూడా హాజరుకానున్నారు. హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి విపక్ష నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.