NTV Telugu Site icon

BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్‌ పార్టీకి తేడా లేదు

Bjp Vishnuvardhan Reddy

Bjp Vishnuvardhan Reddy

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతాయనే వాదన వినిపిస్తూనే ఉంది. అయితే.. మరొపక్క బీఆర్‌ఎస్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్‌ పార్టీ తేడా లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. స్పష్టమ్తెన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడని, కేసీఆర్‌ దోచివేసిన సొమ్ముతో ఏపీలో ప్లెక్సీలు కడుతున్నారు అంటూ ఆయన విమర్శించారు. తెలుగుతల్లికి క్షమాపణ చెప్పి ఏపీలోకి కేసీఆర్‌ అడుగుపెట్టాలని, ఎందరో మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారు. వీరి కుటుంబాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణా తల్లిని కర్నాటక, మహారాష్ట్ర , యూపీ , తమిళనాడు,ఏపీకి ఎలా తెస్తారో చెప్పాలి. దేశాన్ని ఏకం చేసే కెసిఆర్ ఏపిలో నీటి ప్రాజెక్టులప్తె తన వ్తెఖరిని ప్రకటించాలి. ఏపీతోనే వివాదాలు ఉన్న కేసీఆర్‌ జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలను ఎలా మెప్పిస్తారు…!

 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల గణాంకాలకు , భారత ప్రభుత్వం గణాంకాలను పొంతన లేదు. 12 నెలల్లో చేయాల్సిన అప్పులను ఏపి ప్రభుత్వం 6 నెలల్లో చేస్తోంది. జీతాలు రాక ఉద్యోగాలు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేకుండా పోతోంది. ఆర్థికపరమ్తెన విషయాల్లో దొంగ లెక్కలు రాయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. ఏపీకి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టాల్సి వస్తోంది. ఇంకొకసారి వ్తెసీపీ అధికారంలోకి వస్తే జిల్లాలను మరొక రాష్ట్రానికే అమ్మేసే పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమ్తెన విషయాలలో వ్తెసీపీ ప్రభుత్వం శ్వేతప్రతం విడుదల చేయాలి. ప్రజాపోరు ప్రచార రథం ప్తె బొమ్మనహాళ్లులో వ్తెసీపీ నేతలు దాడి చేసి , తిరిగి మా కార్యకర్తలప్తెనే కేసులు పెట్టారు. వ్తెసీపీ నేతలు చేసిన తప్పులకు కేసులు పెట్టాలంటే జైళ్లు సరిపోవు అని ఆయన వ్యాఖ్యానించారు.