తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టబోతుంది. ఈ నెల 20వ తేదీ నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు యాత్రలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఈ యాత్రలను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ కార్యాచరణ చేపట్టనుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేపట్టేలా ప్లాన్ చేయనుంది.
Dancing Video: వీళ్లు డాక్టర్లా..? డ్యాన్సర్లా? ఆస్పత్రిలో రెచ్చిపోయిన మెడికోలు
యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టిన బీజేపీ..
భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు భాగ్యనగరం అని పేరు
కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన
ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరు
మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణా అని పేరు
వరంగల్, మహబూబ్బాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేరు
మార్చి మొదటి వారంలో పెద్ద బహిరంగ సభ పెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
