Site icon NTV Telugu

Munugode By Poll: మునుగోడు ఉపఎన్నికకు 16 మందితో బీజేపీ స్టీరింగ్ కమిటీ

Munugode By Election

Munugode By Election

Munugode By Poll: మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. విజయమే లక్ష్యం కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 16 మందితో ఈ స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి ఆ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్గా నియమించారు. ఈ కమిటీలో ఈటల రాజేందర్‌, విజయశాంతితో, దాసోజు శ్రవణ్‌తో పాటు పలువురు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

స్టీరింగ్ కమిటీ సభ్యులు

1. ఈటల రాజేందర్, ఎమ్మెల్యే
2. జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ
3. గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ
4. విజయ శాంతి, మాజీ ఎంపీ
5. దుగ్యాల ప్రదీప్ కుమార్, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ
6. స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ
7. చంద్ర శేఖర్, మాజీ మంత్రి
8. ఎండ్ల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే
9. రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ
10. రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎంపీ
11. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
12. కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ
13. టి. ఆచారి, నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
14. దాసోజు శ్రవణ్

Exit mobile version