NTV Telugu Site icon

Kishan Reddy: సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోంది..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజాగర్జన’ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు సంధించారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ రకమైన ప్రభుత్వం ఉందో చూడాలన్నారు కిషన్‌ రెడ్డి. ఇంత మోసపూరితమైన సీఎంను ఎక్కడా చూడలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చాలామంది రైతులు పసుపు పండిస్తారని, అనేక ఏళ్లుగా పసుపు బోర్డు కోసం రైతులు పోరాటం చేశారని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసమే పసుపు బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకున్నారని ఈ సందర్భంగా చెప్పారు. సమ్మక్క సారక్క పేరుతో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణ చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు అని అన్నారు కిషన్‌ రెడ్డి. సమ్మక్క-సారక్క దేవతలను కోట్లాది మంది ప్రజలు పూజిస్తారని.. ఆ పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానుందన్నారు. ట్రైబల్‌ యూనివర్సిటీకి ఆ పేరుపెట్టుకోవడం సంతోషకరమన్నారు.

Also Read: PM Modi: పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు..?

సీఎం కేసీఆర్‌పై మాటల బాణాలు వదిలారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఆయన కేంద్రం ప్రారంభించిన ఏ కార్యక్రమంలో పాల్గొనలేదంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోందన్నారు. 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.9లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం యూరియా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా సీఎం రాలేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ వస్తే ఈ సీఎంకు తీరిక ఉండదంటూ మండిపడ్డారు. రూ. 33వేల కోట్లతో అనేక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తే.. సీఎంకు రావడానికి తీరిక ఉండదంటూ విమర్శించారు. మాకు , మా ఫాంహౌస్‌కు ఎంత ఇచ్చారంటూ అని అడిగే తీరు ఉందంటూ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సిద్ధాంత పరంగా వైరుధ్యాలు ఉన్న సీఎంలు మోడీ కార్యక్రమాలకు వస్తారని.. ఈ సీఎం మాత్రం రాడంటూ కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని ఇస్తుంటే.. ముఖ్యమంత్రికి మాత్రం తీరిక ఉండదంటూ మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ అవినీతి కుటుంబ పార్టీలు అని.. ఆ పార్టీలకు గురువు మూర్ఖుడు ఒవైసీ అంటూ కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారని ఆయన అన్నారు. ఆ మూడు పార్టీల DNA ఒక్కటేనని పేర్కొన్నారు కిషన్‌ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగుర వేయాలని కిషన్‌ రెడ్డి బీజేపీ కార్యకర్తలకు సూచించారు.

Show comments