Site icon NTV Telugu

Bandi Sanjay : మన్ కీ బాత్ ను సక్సెస్ చేయండి..

Bandi Sanjay

Bandi Sanjay

ప్రజల మదిలో నిలిచేలా ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అత్యధిక మంది వీక్షించేలా మన్ కీ బాత్ నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు స్రుష్టించబోతుందని, ఈ విషయంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read : Today Stock Market Roundup 28-04-23: బెంచ్ మార్క్‌లను బ్రేక్ చేసి.. సెన్సెక్స్ 61 వేలు, నిఫ్టీ 18 వేలు

కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు వచ్చిన బండి సంజయ్ కుమార్ ఈరోజు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, శక్తి కేంద్ర ఇంఛార్జీలతోపాటు 7 మోర్చాలకు చెందిన మండల, ఆ పైస్థాయి రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Also Read : PT Usha: వారి వల్ల దేశం పరువు పోతోంది.. పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు

ఎల్లుండి నిర్వహించబోయే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలి అంటూ రాష్ట్ర బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చాడు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను పండుగ వాతావరణంలో నిర్వహించాలి అని తెలిపాడు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 కేంద్రాల్లో సగటున కనీసం 100 మంది హాజరయ్యేలా నిర్వహించాలన్నారు.

Also Read : YS Viveka Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జూన్‌ 5కి వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ప్రజలందరూ మన్ కీ బాత్ చూసేలా స్ర్కీన్లు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి అని టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి మన్ కీ బాత్ సెంటర్ వద్ద అలంకరణ చేయడంతో పాటు ప్రజలు, కార్యకర్తలంతా వీక్షించేలా చర్యలు తీసుకోవాలి పేర్కొన్నారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆ వివరాలను ఫోటోలతోసహా నమో యాప్ లో అప్ లోడ్ చేయాలి అని బండి సంజయ్ అన్నారు.

Also Read : MLC Jeevan Reddy : ఆ ఎమ్మెల్యేల మీద చర్యలెందుకు తీసుకోలేదు..

పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రజలకు ఇప్పటి నుండే మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రతంగా ప్రచారం నిర్వహించండి. తద్వారా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను అద్బుతంగా నిర్వహించే విషయంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మోర్చాల నాయకులు ముందుభాగాన ఉండాలి అని బండి సంజయ్ వెల్లడించారు.

Exit mobile version