Site icon NTV Telugu

Mahayuti Alliance: మహాయుతి కూటమిలో ముసలం.. వైదొలుగుతామంటున్న ఎన్సీపీ

Maharastra

Maharastra

మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన- ఏక్ నాథ్ షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌ పవార్‌ వర్గంతో కూడిన ‘మహాయుతి’ కూటమిలో ముసలం స్టార్ట్ అయింది. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ లక్ష్యంగా సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన నేత విజయ్‌ శివ్‌తారే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు బారామతి లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించడంతో అజిత్‌ పవార్‌ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. శివ్‌తారేను పార్టీ నుంచి తొలగించకపోతే.. అధికార మహాయుతి కూటమి నుంచి తాము వైదొలుతామని ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం అల్టిమేటం జారీ చేసింది.

Read Also: Aravind Kejriwal : జైల్లో కంప్యూటర్, పేపర్ లేదు.. మరి కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు ?

ఇక, ఎన్సీపీ అధికార ప్రతినిధి ఉమేశ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. శివ్‌తారేపై చర్యలు తీసుకోవాలని ఇది వరకే తాము ఏక్ నాథ్ షిండేను కోరామన్నారు. అయినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి శరద్‌ పవార్‌ వర్గం తరపున సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి ఆయన భార్య సునేత్ర పవార్‌ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే, ఈ స్థానం నుంచి తాను కూడా పోటీ చేస్తానని మహాయుతి కూటమిలోని శివసేన నేత విజయ్‌ శివ్‌తారే ఈ నెల 12వ తేదీన ప్రకటించడం తీవ్ర వివాదంగా మారింది అని పేర్కొన్నారు.

Exit mobile version