NTV Telugu Site icon

BJP S.Kumar : యూపీఏ హయంలో నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించారు..

Bjp S Kumar

Bjp S Kumar

కిషన్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సింగరేణి ఇబ్బందులకు కారకులు ఎవరు… ఇప్పుడు చర్చ జరుగుతుందన్నారు బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయంలో నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించారని ఆయన తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ లతో ప్రైవేట్ సంస్థలు వేల కోట్లు అప్పులు తీసుకున్నాయని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి అప్పుడు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని, గత రాష్ట్ర ప్రభుత్వం నాలుగు గనులను కేటాయించాలని కేంద్రాన్ని అడగలేదన్నారు.

ఇచ్చిన టైమ్ లో రాష్ట్రం అడగక పోవడం తో వాటిని వేలం వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు ఎస్‌ కుమార్‌. కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి నీ ప్రైవేట్ పరం చేయాలని అనుకుందని, కాంగ్రెస్ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనులు వేలం జరుగుతుంది .. వేల కోట్ల రాయల్టీ ఆ ప్రభుత్వాలకి వస్తుందని ఆయన ఆరోపించారు. సెంటిమెంట్ కోసం సింగరేణి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, సింగరేణి నాశనం కి కారణం కేసీఆర్‌ అని ఆయన అన్నారు. సీబీఐ విచారణ కు సిద్దమా అని అడుగుతున్నామని, సింగరేణి పై రాష్ట్రప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.