NTV Telugu Site icon

Gujarat Assembly Elections: స్పీడ్‌ పెంచిన బీజేపీ.. అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Bjp

Bjp

Gujarat Assembly Elections: రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను శనివారం విడుదల చేసింది. ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండో జాబితాలో ఇద్దరు మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. ధోరాజీ నుంచి మహేంద్రభాయ్ పడలియా, ఖంభాలియా నుంచి ములుభాయ్ బెరా, కుటియానా నుంచి ధెలిబెన్ మాల్దేభాయ్ ఒడెదర, భావ్‌నగర్ ఈస్ట్ నుంచి సెజల్ రాజీవ్ కుమార్ పాండ్యా, దేడియాపాడ (ఎస్టీ) నుంచి హితేష్ దేవ్‌జీ వాసవా, చోర్యాసీ నుంచి సందీప్ దేశాయ్‌లను బరిలోకి దించింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 182 నియోజకవర్గాల్లో 160 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది.160 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో 14 మంది మహిళలు, 13 మంది షెడ్యూల్డ్ కులాలు, 24 మంది షెడ్యూల్డ్ తెగకు చెందినవారు, 69 మంది అభ్యర్థులు రిపీట్ అయ్యారు. రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మొదటి రౌండ్‌లో, మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి, దాదాపు అన్ని నియోజకవర్గాలకు ప్రముఖ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర కేబినెట్ సహచరులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవ్య, పురుషోత్తం రూపాల పేర్లు జాబితాలో ఉన్న ఇతర ప్రముఖులు. ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీలు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కూడా ఉన్నారు. బీజేపీ ప్రచారకర్తల జాబితాలో కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా కూడా ఉన్నారు.

Tamilnadu CM MK Stalin: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..

బీజేపీకి కంచుకోటలా ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో అధికార పార్టీ మళ్లీ పాగా వేయాలని అనుకుంటోంది. ఈసారి కూడా మంచి మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావాలని ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఏది ఏమైనప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి బీజేపీ గట్టి ఎన్నికల సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇసుదాన్‌ గాధ్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిపింది. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ కూడా తన ఉత్తమ ఎన్నికల అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది.గత 27 ఏళ్లుగా రాష్ట్రంలో బీజీపీ గుజరాత్‌లో అధికారంలో ఉంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఫలితాల తేదీతో పాటు డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.