Site icon NTV Telugu

Tripura Assembly Polls: 48 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ

Tripura

Tripura

Tripura Assembly Polls: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ధన్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్‌ను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తోందని, మొత్తం 60 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్జీ శుక్రవారం తెలిపారు. ఆయన ఢిల్లీలో సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ కమిటీ సమావేశం అనంతరం జాబితాను ఖరారు చేసినట్లు భట్టాచార్జీ తెలిపారు. బీజేపీ అభ్యర్థులు షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలతో సహా వివిధ వర్గాలకు చెందిన నేతలు ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారని ఆయన చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా టౌన్ బోర్డోవాలి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎంపీ ప్రతిమా భూమిక్ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నిరంతరం పాలించిన సీపీఐ(ఎం)ని ఓడించి 2018లో తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మాజీ కాంగ్రెస్ నాయకుడు, రాజ వంశీయుడు ప్రద్యోత్ దేబ్ బర్మాన్ స్థాపించిన ప్రాంతీయ పార్టీ అయిన టీఐపీఆర్‌ఏ(TIPRA- The Indigenous Progressive Regional Alliance)తో ఎన్నికలకు ముందు పొత్తు కోసం బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపారు. కానీ టిప్రా(TIPRA) పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తోంది. అయితే కూటమి భాగస్వామి ఐపీఎఫ్‌టీతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని భట్టాచార్జీ పేర్కొన్నారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మోబోషర్‌ అలీ, తృణమూల్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుబల్‌ భౌమిక్‌లు బీజేపీలో చేరడంపై రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌-సీపీఐ(ఎం) కూటమిని ఆమోదించలేరని తాము చూశామని, ఇంకా చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. సీపీఎం ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

Chartered plane crash: సాంకేతిక లోపంతో కూలిపోయిన చార్టర్డ్‌ విమానం

శుక్రవారం ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ కుమార్ దేబ్, సంస్థ కార్యదర్శి ఫణీంద్రనాథ్ శర్మ, త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఛార్జ్ డాక్టర్ మహేష్ శర్మ ఇతర నేతలు ఢిల్లీ నుంచి చార్టర్డ్ విమానంలో తిరిగి వచ్చారు. అయితే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా నామినేషన్లను 30 వ తేదీ వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 30తో ముగియనుండగా.నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ ఫిబ్రవరి 2 అని పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో, BJP, 43.59 శాతం ఓట్లతో 36సీట్లను సాధించి, బిప్లబ్ కుమార్ దేబ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కూటమి 44.36 శాతం ఓట్లను పొందగా, కేవలం 16 సీట్లు మాత్రమే సాధించింది.

 

Exit mobile version