BJP: బీజేపీ రెండో జాబితా వచ్చేసింది.. తెలంగాణ నుంచి ఎంతమందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తెలంగాణ రెండో జాబితాలో అభ్యర్థులు వీరే
ఆదిలాబాద్-గోడం నగేశ్
పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్
మెదక్-రఘునందన్‌రావు
మహబూబ్‌నగర్-డీకే అరుణ
నల్గొండ-సైదిరెడ్డి
మహబూబ్‌నగర్-సీతారాం నాయక్
రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 150 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి కానీ.. 72 మందితోనే సరిపెట్టేశారు. ఇక తొలి జాబితాలో 195 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో ప్రధాని మోడీ ఉన్నారు. ఆయన మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక ఏపీ నుంచి అభ్యర్థులను ఎవర్నీ ప్రకటించలేదు. ఇటీవలే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు స్థానాలను కేటాయించారు. రేసులో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, జీవీఎల్.నరసింహారావు పేర్లు వినిపించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి మాత్రం వెళ్లలేదు.
ఇక మంగళవారం కాంగ్రెస్ కూడా రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి 43 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అభ్యర్థులను వెల్లడించింది. తొలి జాబితాలో 39 మందిని ప్రకటించగా.. సెకండ్ లిస్టులో మాత్రం 43 మందిని ప్రకటించింది. 43 మందిలో జనరల్ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Union Minister Anurag Thakur to contest from Himachal Pradesh's Hamirpur, former Karnataka CM Basavaraj Bommai to contest from Haveri, BJP MP Tejasvi Surya to contest from Bangalore South, Union Minister Nitin Gadkari to contest from Nagpur, Union Minister Piyush Goyal to contest… https://t.co/FMsQL4yX1M
— ANI (@ANI) March 13, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..