Bjp Released Manifesto For Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. మునుగోడు నియోజకవర్గంలో ‘మెగా డెవలప్ మెంట్’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు ఎన్నిక సందర్భంగా ఇంకా ఏడాది కాలం మాత్రమే ఉన్నందున ఈ ఏడాది కాలం లో బీజేపీ చేయనున్న అభివృద్ధి పై మెగా డెవలప్ మెంట్ పేరుతో మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
500 రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సమగ్ర అభివృద్ధి చేస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. మునుగోడులో ఫ్లోరైడ్ పూర్తిగా తొలగిస్తాం.. ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ భగీరథ విఫలం అయింది. టెక్స్ టైల్ ప్రాజెక్ట్, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన చేపడతామన్నారు. రూ. 200 కోట్లతో రోడ్ల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పించి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుచేస్తామని, రాచకొండ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టూరిజం కేంద్రం ఏర్పాటుచేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, పీఎం శ్రీ పథకం క్రింద స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. చౌటుప్పల్ లో 100కోట్ల రూపాయలతో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. రూ.100 కోట్లతో మూసీ నీళ్లను చౌటుప్పల్ లోని గ్రామాలకు ఎత్తి పోసే పథకాన్ని తీసుకొస్తామని రాజగోపాల్ మేనిఫెస్టోలో ప్రకటించారు.
గతంలోనూ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. తాము గెలిచి మళ్లీ ఎమ్మెల్యే అయినప్పటికీ నేరుగా కేంద్రం నుండి నిధులు తెస్తామని..టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా ఏం కాదని అంటున్నారు. 18వేల కోట్ల కాంట్రాక్ట్ అంటూ టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే… బీజేపీ మాత్రం మునుగోడుకు ఇస్తున్న హామీలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. మరి రాజగోపాల్ రెడ్డినే మళ్లీ ఓటర్లు ఎన్నుకుంటారా.. మెగా డెవలప్ మెంట్ మేనిఫెస్టో ఓటర్లకు నచ్చుతుందా అనేది చూడాల్సి వుంది.
మునుగోడు నియోజకరవర్గం మ్యానిఫెస్టో ‘‘500 రోజుల్లో మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులతో మెగా మాస్టర్ ప్లాన్…’’@krg_reddy
(1/2) pic.twitter.com/2nWdH62ifk— BJP Telangana (@BJP4Telangana) October 26, 2022
