Site icon NTV Telugu

BJP Public Meeting: నేడు సంగారెడ్డిలో బీజేపీ బహిరంగ సభ

Bjp

Bjp

బీఆర్ఎస్ కు ముదిరాజ్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు రాజీనామా చేశారు. నేడు ( సోమవారం ) బీజేపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. అయినా తనకు టికెట్ రాలేదని వాపోయారు. ఇవాళ సంగారెడ్డి స్టేడియం గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరబోతున్నానని పులిమామిడి రాజు పేర్కొన్నారు.

Read Also: US Open 2023: యుఎస్‌ ఛాంపియన్‌గా జకోవిచ్‌.. మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డు సమం!

ఈ రోజు జరిగే బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు హాజరవుతారని, వారి సమక్షంలో బీజేపీలో చేరుతానని సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తమకు ఎక్కడా టికెట్లు ఇవ్వని సీఎం కేసీఆర్.. కనీసం సంగారెడ్డి నియోజకవర్గంలో అయినా తమకు ఛాన్స్ ఇవ్వాలని ముదిరాజ్ లు డిమాండ్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ముదిరాజ్ కులస్తుల సూచనలు, సలహా మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

Read Also: Rajasthan: సామూహిక అత్యాచారం నగ్నంగా పరుగులు తీసిన మహిళ

అయితే, బీఆర్ఎస్ నేత పులిమామిడి రాజు రాజీనామా చేయడంతో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తుల ఓటు బ్యాంకు సుమారు 40 శాతంకు పైగా ఉంది. పైగా ముదిరాజ్ సంఘం తరఫున రాజు కొన్నేళ్లుగా నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో సంఘం పెద్దలు, కుల ఓటర్లు ఆయన అభ్యర్థిత్వానికే సపోర్ట్ తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు ముందే ముదిరాజ్ సంఘం తరఫున సంగారెడ్డి నుంచి రాజు పేరు ప్రతిపాదించారు. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనను పట్టించుకోకపోవడంతో.. తాజాగా పులిమామిడి రాజు రాజీనామాతో బీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.

Exit mobile version