Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao: కల్వకుంట్ల కవిత నేడు తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పార్టీ పేరు ప్రకటించారు. ఇక కవిత కొత్త పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది.. అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన అందించారని చెప్పారు. “గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్ పుట్టబోయే బిడ్డ పేరు టీఆర్ఎస్ అంటా.. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎన్ని పార్టీలు ఉన్నా బీజేపీకి ఇబ్బంది లేదు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.” అని రామచందర్‌రావు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కుంటే బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. “విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకి బీజేపీ. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సవాల్ విసురుతున్నా.. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఏపీలో కలిసిన కనీసం 5 గ్రామాలను వెనక్కి వచ్చేలా చూడాలి. భద్రాచలం వద్ద ఉన్న 5 గ్రామాలు పోతే రాముడి గుడి మునుగుతుంది. గ్రామాలను వెనక్కి తీసుకురావడానికి జాగృతి తరఫున కేంద్రానికి లేఖ రాశాం. మూడు పార్టీలపై అలుపెరగని పోరాటానికి కార్యకర్తలంతా సిద్ధం కావాలి’’ అని కవిత పేర్కొన్నారు.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
అనంతరం బీఆర్ఎస్, కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “మన కేసీఆర్ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు. కేటీఆర్ మాట్లాడారంటే అనుకోవచ్చు. ఆయనకు రాజకీయం తెలియదు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి కేసీఆర్ ఎక్కడున్నారు..? మారుతారేమోనని చూశా.. కానీ, నన్నే సస్పెండ్ చేశారు. ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే తాను మాట్లాడాల్సింది. కానీ, మాట్లాడలేదు.. ఇవాళ నాకు అదే జరిగింది. ఉద్యమంలో కొట్టినవారినే తీసుకొచ్చి పట్టం కట్టారు. వాళ్ల అనుచరులు మనవాళ్లను అణగతొక్కారు. ఉద్యమకారులను నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేది. కండువా వేసుకొని అప్పుడు పిచ్చొల్లలాగా తిరిగాం. ఆ పార్టీలో అమ్మతనం పోయింది, మమకారం పోయింది. అందుకే కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మరబొమ్మ అయ్యారు.” అని కవిత వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!