Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bjp Plans Comprehensive Debate On Constitution Pm Modi To End House Debate

BJP: రాజ్యాంగంపై చర్చకు బీజేపీ సన్నాహాలు.. లోక్‌సభలో సమాధానం ఇవ్వనున్న ప్రధాని!

Published Date :December 10, 2024 , 2:24 pm
By Mahesh Jakki
  • రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు
  • లోక్‌సభలో జరిగే ఈ చర్చలో సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీ
  • రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
BJP: రాజ్యాంగంపై చర్చకు బీజేపీ సన్నాహాలు.. లోక్‌సభలో సమాధానం ఇవ్వనున్న ప్రధాని!
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP: రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్‌సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం. 2024 ఎన్నికలకు ముందు, బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి, దీనికి బీజేపీ ఇప్పుడు సమాధానం చెప్పాలనుకుంటోందని తెలుస్తోంది.

పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు రోజుల పాటు రాజ్యాంగంపై చర్చ జరగనుంది. డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. బీజేపీ పెద్ద నేతలంతా ఈ చర్చలో పాల్గొంటారు. ఈ చర్చపై లోక్‌సభలో ప్రధాని మోదీ స్పందించనున్నారు. అమిత్ షా రాజ్యసభలో చర్చను ప్రారంభించవచ్చు. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ కూడా తమ తమ సభల్లో చర్చలో పాల్గొంటారు. నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా, రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో బీజేపీ ఉపనేతగా ఉన్నారు. ఈ చర్చలో తమ కీలక నేతలందరినీ చేర్చుకోవడం ద్వారా బీజేపీ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నదనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది. అలాగే పార్లమెంటును సజావుగా నడపాలని, విపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రజల అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది.

Read Also: Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

లోక్‌సభ ఎన్నికల నాటి నుండి, బీజేపీ రాజ్యాంగం పట్ల తన నిబద్ధతను ప్రతి అవకాశంలోనూ చూపించడానికి ప్రయత్నిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్,.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు చేస్తుందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించేందుకు బీజేపీ జూన్ 25ని ‘రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటించింది. ఈ రోజును ఎమర్జెన్సీ వార్షికోత్సవంగా జరుపుకుంటారు.

75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సంస్కృతి, పర్యాటకం, చట్టం, పార్లమెంటరీ వ్యవహారాలు, సామాజిక న్యాయం సహా నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజ్యాంగంపై చర్చ రాజకీయ చర్చలో నిత్యం భాగమైంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ చర్చ ద్వారా ఈ అంశంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసి ప్రజల మద్దతును పొందాలనుకుంటోంది. పార్లమెంటులో ఈ చర్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Elections
  • Amit Shah
  • bjp
  • bjp leaders
  • BJP's Commitment

తాజావార్తలు

  • First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions