ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు పాల్గొననున్నారు. సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజనాధ్ సింగ్, డా. లక్ష్మణ్ లాంటి తదితర సీనియర్ కీలక నేతలతో పాటు, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ”కి చెందిన ముగ్గురు సభ్యులు ఉండనున్నారు.
Also Read: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు చేస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు, 8 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల కోసం అభ్యర్థులను బిజేపి ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీజేపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు డా.లక్షణ్ ఢిల్లీ కి వెళ్తున్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఈరోజు రాత్రికి ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. అభ్యర్ధి ఎంపిక పై తెలంగాణ పార్టీ ఇంచార్జ్ తో సహా, ఇతర పెద్దలతో రామచంద్రరావు చర్చలు జరిపారు.
Also Read:Andhra Pradesh : ఏపీలో భారీ ఐటీ దాడులు..150 బంగారం బిస్కెట్లు, రూ.40 కోట్ల కాష్ స్వాధీనం!
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటో చేసే స్థానాలపై ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన అవగాహన.. బిజేపి పోటీ చేసే స్థానాలు పై స్పష్టత రావడంతో, ఆయా స్థానాలకు అభ్యర్థులను కూడా నేడు ఖరారు చేయనున్న బీజేపి పార్లమెంటరీ బోర్డు. ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల సీట్ల సర్దుబాటు పై ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా రానున్న ప్రకటన.. బీజేపి నేతృత్వంలోని “ఎన్.డి.ఏ” కూటమి లో మొత్తం భాగస్వామ్య పక్షాల సంఖ్య 5, బిజేపి 101 స్థానాల్లో, జేడి-యు 102 స్థానాల్లో పోటీ..“ఎల్.జె.పి” (రామ్ విలాస్ పాశ్వాన్) 26 స్థానాల్లో పోటీ.. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని
“హిందుస్థానీ అవామ్ మోర్చా” (హెచ్.ఏ.ఎమ్) 8 నుంచి 9 స్థానాల్లో పోటీ.. ఉపేంద్ర కుష్వా నేతృతంలోని “రాష్ట్రీయ లోక్ మోర్చా” (ఆర్.ఎల్.ఎమ్) 6 నుంచి 7 స్థానాల్లో పోటీ.. “మహా ఘఠ్ బంధన్” లో కూడా సీట్ల సర్దుబాటు పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
