NTV Telugu Site icon

Arvind Kejriwal Big Claim: గుజరాత్‌ ఎన్నికల నుంచి తప్పుకోవాలని బీజేపీ బిగ్‌ ఆఫర్‌

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal Big Claim: గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలగితే దర్యాప్తులో చిక్కుకున్న మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను విడిచిపెడతామని బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం ప్రకటించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోని అరవింద్‌ కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. గుజరాత్‌ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ ఆఫర్‌ ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ దూకుడు పెంచిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.

TATA Motors: కార్ల ధరలను పెంచుతూ టాటా కీలక నిర్ణయం..

‘ఢిల్లీలో ఏకకాలంలో ఎంసీడీ ఎన్నికలను నిర్వహించడం ద్వారా కేజ్రీవాల్‌ ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు.. బీజేపీకి భయం పట్టుకుందని.. రెండు చోట్లా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నట్లయితే.. అసలు విషయమేమిటంటే.. గుజరాత్, ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో తాము ఓడిపోతామని బీజేపీ భయపడుతోంది, అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి జరగేలా చూసుకున్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు. “ఆప్‌ని వీడి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండాలన్న వారి ప్రతిపాదనను మనీష్ సిసోడియా తిరస్కరించిన తర్వాత, వారు ఇప్పుడు నన్ను సంప్రదించారు. మీరు గుజరాత్‌ను వదిలి అక్కడ పోటీ చేయకుంటే, సత్యేందర్ జైన్, సిసోడియా ఇద్దరినీ విడిచిపెడతామని, అన్ని ఆరోపణలను ఎత్తివేస్తామని వారు చెప్పారని” కేజ్రీవాల్ చెప్పారు.