Site icon NTV Telugu

BJP Meeting: తెలంగాణపై బీజేపీ నజర్.. రేపు హైదరాబాద్ లో 11 రాష్ట్రాల కమలం నేతల సమావేశం.

Bjp Meeting

Bjp Meeting

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ( శుక్రవారం ) ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించగా.. రేపు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వస్తున్నారు.

Read Also: Palak Puraswani: వాడు దారుణంగా మోసం చేశాడు.. బెడ్రూంలో నటితో శృంగారం చేస్తూ..

అయితే.. హైదరాబాద్ లో జరుగనున్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మీటింగ్ కొనసాగనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలే టార్గెట్‌గా కమలం పార్టీ ఈ కీలక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వ్యూహాలను సిద్ధం చేయనుంది. అటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు హైకమాండ్ నియమించింది.

Read Also: Jal Shakti: జల్‌శక్తి శాఖ కీలక ఒప్పందం.. నీటి వినియోగ సామర్థ్యం పెంచే దిశగా చర్యలు

ఇందులో భాగంగానే తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్ జవదేకర్‌కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.. అతనితో పాటు సహ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ ను నియమించింది. మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్‌, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా ఓం ప్రకాష్ మాథుర్‌, మాండవియాలను నియమించింది. ఇక తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలతో పాటు ఇప్పుడు 11 రాష్ట్రాలకు చెందిన కమలం పార్టీ అధ్యక్షుల సమావేశాలతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి.

Exit mobile version