హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదన్నారు బీజేపీ ఎంపీ, డాక్టర్ లక్ష్మణ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. పరేడ్‌తో గణతంత్ర దినోత్సవం చేయాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా బేషజాలకు పోకుండా ఉండాలని ఆయనకు సద్బుద్ధి రావాలని కోరుతున్నామన్నారు. కరోనా ఉందని సాకు చెప్పడం హాస్యాస్పదమని, మీ పార్టీ సభలకి లేని కోడ్ గణతంత్ర దినాన్ని మాత్రం పెట్టడం దారుణమన్నారు. అంతేకాకుండా.. ‘ దేశం గర్వించదగ్గ వేడుకకి తుచ్ఛమైన రాజకీయాలు ఆపాదించడం దారుణం. మీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు చీదరిస్తున్నారు.
Also Read : Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్ర.. బొట్టుపెట్టి పంపిన బ్రాహ్మణి
మీరు బాబుసాహెబ్ అంబేద్కర్ కు , రాజ్యాంగానికి వ్యతిరేకం అని మరోసారి రుజువయ్యింది. మీది రాజరికం, పెత్తందారీ విధానము, గడీల పాలన. బై ది కేసీఆర్, ఫర్ ది కేసీఆర్, ఆఫ్ ది కేసీఆర్ అన్నట్టు ఉంది. నేను నా కుటుంబం, నా కుటుంబం కొరకు, కుటుంబం కొరకు, నా కుటుంబం వల్ల అన్నట్టు ఉంది. మేధావులు ఆలోచన చేయాలి. ప్రతీ సంప్రదాయం కోర్టు ద్వారానే కాపాడలంటే కష్టం. ప్రభుత్వం రాజ్ భవన్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. కేబినెట్ ఎప్పుడు జరిగింది, నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు. అంటే ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?. తెలంగాణ సామ్రాజ్యానికి కేసీఆర్ రారాజు అనుకుంటున్నాడు.’ అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.
Also Read : Malikapuram Review: మాలికాపురం (మళయాళం డబ్బింగ్)
