Site icon NTV Telugu

MP K Laxman : కేటీఆర్ నేనే తెలివిమంతున్ని అనుకుంటున్నారు

Laxman On Paper Leak

Laxman On Paper Leak

కేటీఆర్ నేనే తెలివిమంతున్ని అనుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మదంతో మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రానా మిగతా వారిని చులకన చేసి మాట్లాడతావా అని ఆయన అన్నారు. నేను పక్కా లోకల్ … కేజీ నుండి పీజీ వరకు ఇక్కడే చదువాను.. సీహెచ్‌డీ ఇక్కడే చేశాను.. ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని, తెలంగాణలో మూత పడ్డ పరిశ్రమలకు దిక్కు లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ చక్కర పరిశ్రమ , ఆల్విన్ కంపెనీ , అజంజహి, ప్రగా టూల్స్, రేయన్స్ పరిస్థితి ఏంది అని ఆయన ప్రశ్నించారు. HMT,idpl భూముల పై కన్నేశారని ఆయన అన్నారు. కేటీఆర్ అహంకార పూరిత వ్యాఖ్యలు అధికారమదంతో చేసినట్లు స్పష్టమవుతున్నాయని, బయ్యారం విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం ఫీజిబిలిటీ కోసం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారన్నారు.

Also Read : Most Viewed Photo : ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన ఫోటో ఇదే..!

మోదీ ప్రభుత్వం సహజ ఖనిజాలు హక్కులు పూర్తిగా రాష్ట్రాలకు కట్ట బెట్టిందని, కాంగ్రెస్ హయాంలో పూర్తిగా బొగ్గు కుంభకోణంలో మునిగి పోయిందన్నారు. అంతేకాకుండా.. ‘మోదీ ప్రభుత్వం 31ఖనిజాల హక్కులను రాష్ట్రాలకే ఇచ్చింది. బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం కేసీఆర్ సర్కారు ఏమీ చేసిందో చెప్పాలి. నిక్షేపాలను ఆధారంగా చేసుకుని కడప స్టీల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. జిందాల్ ద్వారా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్రంగా నష్ట పోయాయి. నల్గొండలో యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మేము తవ్వనివ్వమని మొండికేశారు. 35 కిలోల బొగ్గుకు ఒక కిలో యురేనియం సమానం. తెలంగాణలో ప్రైవేటుకు ప్రమేయం లేదని చెప్పగలరా. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు. అసత్యాలను సత్యాలుగా చిత్రీకరిస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.’ అని లక్ష్మన్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Vetrimaaran: ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్.. రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..?

Exit mobile version