GVL Narasimha Rao: ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఇప్పటివరకు ఐటీకి సంబంధించిన పాలసీ తప్ప పని జరగడం లేదని బీజేపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఐటీ కోసం శాటిలైట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రభుత్వం సహకరించి, అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బహిరంగ లేఖ రాశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ అప్స్ కోసం సహకారం అందించాలని కోరారు. ఐటీ కంపెనీలకు ఇన్సెంటివ్స్ రూపంలో 90 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని లేఖలో కోరినట్టు చెప్పారు. ఐటీ అభివృద్ధిని ఈ ఏడాది ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కోరారు.
Joinings in BRS: రేపు బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనే!
ప్రభుత్వ పాలన లోపాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకుని వెళతామని చెప్పారు. ఓటు బ్యాంకు నిర్మాణంపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవాలని అన్నారు. 2023లో ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయాలని.. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ జీవీఎల్ కోరారు. ఐటీ ఏపీ రాష్ట్రానికి ప్రధాన ఆస్తి అని, దానిని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. చాలా మంది ఆంధ్ర ప్రదేశ్ నాయకులు ఇప్పుడు కూడా హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నారని.. ఐటీ రంగంలో ఏపీని అభివృద్ధి చేయడంలో పూర్తిగా ఆసక్తి చూపడం లేదని విమర్శించారు.