ఏపీలో పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖ పర్యటన వుంటుందన్నారు. 15 పథకాలతో పాటు పలు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనను వాళ్ల పార్టీ కార్యకలాపాలతో కలిపి కలగాపులగం చేస్తున్నారు. గతంలో అల్లూరి శత జయంతిని ఇలాగే ఖరాబు చేశారు. విశాఖలో ఇప్పటికే పాలన భ్రష్టు పట్టించారు. భూ కబ్జాలు పెరిగిపోయాయి. విపక్షాల అణచివేత చట్ట విరుద్ధంగా సాగుతోంది.. వీటిని ఖండిస్తున్నామన్నారు.
Read Also:Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
జన సేన నేత పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా తీరుమార్చుకోలేదు. పవన్ కల్యాణ్ మీద రెక్కీ దారుణం. ఆయనకు సెక్యూరిటీ పెంచాలి. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇపుడు మళ్లీ అయ్యన్న పాత్రుడిని వేధించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిన పోలీసులే తాళాలు పగలగొట్టి, గోడలు దూకీ వెళ్లటం ఏంటన్నారు. ఆ విషయంలో కోర్ట్ చీవాట్లు పెట్టింది. మోడీ 11 రాత్రి విశాఖ చేరుకుంటారు. 12 న రోడ్ షో, సభ ఉంటాయి. సోము వీర్రాజు నేతృత్వాన ఏర్పాట్లు చేస్తాం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మోదీజీ పర్యటన విజయవంతం చేయాలి. స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ కు కట్టుబడి ఉన్నామన్నారు మాధవ్.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై మాధవ్ మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా వేరే పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరితే వారు పదవికి రాజీనామా చేసి గెలవాల్సి ఉంటుంది. మునుగోడు ఎన్నికల నేపధ్యంలో కెసిఆర్ డ్రామా ఆడారు కానీ ఫెయిలయ్యారు. తెలంగాణలో కూడా ఎవరన్నా చేరితే రాజీనామా చేయాల్సిందే. మరి కూరగాయలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏముంది? బిజెపి ఎప్పుడూ అ పని చెయ్యదన్నారు. కేవలం చిన్న విషయాలను కేసీఆర్ భూతద్దంలో చూపిస్తున్నారు. అధికారంలో మీరే ఉన్నారు సిబిఐ ఎంక్వయిరీ వేయాలన్నారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.
Read ALso: Usha Thakur: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి.. మహిళా మంత్రి కీలక వ్యాఖ్యలు