NTV Telugu Site icon

BJP: రాజ్భవన్లో గవర్నర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

Bjp

Bjp

BJP: రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు.

Free RTC: తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

అంతకుముందు.. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ప్రమాణం చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. ఈ విషయంపై నిన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన స్టాండ్‌ను స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపిక చేస్తే శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. తన ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయరని కూడా చెప్పారు.