Site icon NTV Telugu

MLA Raja Singh : బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..

Raja Singh

Raja Singh

బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. పండుగ ఎలా జరుపుకుంటారో తమకు అనవసరమని.. కానీ పశువులను కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తాము బాధ్యులం కాదని తేల్చిచెప్పారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. పశువుల వాహనాలను పోలీసులు తూ తూ మంత్రంగా చెక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ రవాణాను అడ్డుకుంటున్న తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

READ MORE: Weather Update: ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన..

పోలీసులు అడ్డుకుంటున్న వాహనాలను ఎంఐఎం కార్పొరేటర్లు గుండాల ప్రవర్తించి విడిపిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పటికే చాలా ఆవులు, ఎద్దులు సిటీలోకి వచ్చాయన్నారు. సీఎం రాష్ట్రానికి రాజు లాంటి వాడు.. ముఖ్యమంత్రి గోమాత ప్రేమికుడని ఎన్నికల సమయంలో గోమాతను పూజ చేయడం చూశానని రాజాసింగ్ చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో పాపం ఎవరు చేసిన అది సీఎం రేవంత్ రెడ్డికే తగులుతుందన్నారు. జూన్ 7న బక్రీద్ నాడు.. పాపంలో భాగస్వామి కావొద్దని సీఎం రేవంత్‌కు సూచించారు. ఆవులు, ఎద్దులు, దూడలు తీసుకొని వస్తున్నా వారిపై మీరు యాక్షన్ తీసుకోవాలని.. లేదంటే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు.

READ MORE: Hyderabad: గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై సంచలన విషయాలు బయటపెట్టిన బాధితులు..!

Exit mobile version