Kailash Vijayvargiya: మధ్యప్రదేశ్ మంత్రివర్గ సభ్యుడు కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఇంద్రలో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో భాజపా సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ తనకు “చిన్న దుస్తులు వేసుకునే అమ్మాయిలు నచ్చరు” అంటూ మహిళల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల్లో తక్కువ దుస్తులు వేసుకునే మహిళను అందంగా భావిస్తారు. కానీ, నేను అలా అనుకోను. మన దేశంలో బంగారు ఆభరణాలు ధరించి, గౌరవంగా దుస్తులు వేసుకునే అమ్మాయిలనే అందంగా చూస్తా అని అన్నారు.
Read Also: Physical Harassment : వికారాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి..!
నేను మహిళను దైవ రూపంగా భావిస్తాను. అలాంటి అమ్మాయిలు శోభాయమానంగా, మంచిగాతో దుస్తులు ధరించాలి. కానీ చిన్న దుస్తులు వేసుకొనే అమ్మాయిలు నాకు నచ్చరని అన్నారు. కొన్ని సార్లు అమ్మాయిలు నాతో సెల్ఫీ తీసుకోవడానికి వస్తారు. “అప్పుడు వారితో నేను.. బేటా, మరోసారి దుస్తులు సరిగా వేసుకునిరా, అప్పుడు ఫోటో తీసుకుందాం” అని అంటానని ఆయన తెలిపారు.
Read Also: MPs Suspend: హాకా నిరసన.. పార్లమెంటు నుంచి ముగ్గురు ఎంపీలు సస్పెండ్..!
ఇదివరకు 2022లో హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి అమ్మాయిలు అసభ్యంగా ఉండే దుస్తులు ధరిస్తున్నారు. మనం వారిని దేవతలుగా పిలుస్తాం కానీ వారు అలా కనిపించడంలేదు… వాళ్లు శూర్పణఖలా కనిపిస్తున్నారు అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
