ఈ నెల 23, 24వ తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో 9 టీమ్ లు పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 18 ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల బృందాలు పర్యటిస్తాయని ఆయన తెలిపారు. అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తాయని, ఈ నెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హై కమాండ్‌కు కప్పం కట్టేందుకు ప్రతినెలా ఎత్తులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మూసీ మీద రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. DPR ఇవ్వకుండా అఖిల పక్షం మీటింగ్ ఏంది అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ది బాలక్ బుద్ధి… మూసీలో అంబాడుతున్నట్టు ఉందన్నారు.
Ranji Trophy: డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా.. సెలక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..!
లక్కీ లాటరీ తగిలి సీఎం అయ్యావని, మూసీ చరిత్ర నీకు తెలుసా.. ముస్కుందా మహర్షి పేరు మీద ఆ పేరు వచ్చిందన్నారు కాసం వెంకటేశ్వర్లు. మూసీ తీరంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీ ఊరుకోదు… పోరాడుతుందన్నారు. నిన్ను, మీ కాంగ్రెస్ పార్టీ నీ మూసీలో ముంచుతామన్నారు. మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పునరుజ్జీవం సుందరీకరణ చేస్తే మేము మద్దతు ఇస్తామని, మూసీకి ఇరువైపులా రీటైనింగ్ వాల్ కట్టు అని ఆయన అన్నారు. అందులో కలిసే డ్రైనేజ్ ను ఏమీ చేస్తారన్నారు.
Botsa Satyanarayana: డయేరియా మరణాలకు కూటమి సర్కారే కారణం.. బొత్స కీలక వ్యాఖ్యలు