ప్రధాన మంత్రి మోడీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఓ కాంగ్రెస్ నాయకుడు. ఇది కాస్త వైరల్ కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కాంగ్రెస్ నాయకుడిని రోడ్డుపైకి లాక్కొచ్చి చీరకట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రకాష్ అలియాస్ ‘మామా’ పగారే ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ప్రధానమంత్రి మార్ఫింగ్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read:Donald Trump: ట్రంప్ మళ్లీ పిచ్చికూతలు.. భారత్-పాక్‌తో సహా 7 యుద్ధాలను నేనే ఆపా..
డోంబివాలికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పగారే సోమవారం ఎడిట్ చేసిన వీడియోను “క్షమించండి అమ్మాయిలు, నేను కూడా ట్రెండ్‌లో ఉండాలనుకుంటున్నాను” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఈ క్లిప్ ప్రసిద్ధ మరాఠీ పాట “మి కాషాలా అర్షాత్ పహు గా”కి సెట్ చేశారు. మోడీ చీర కట్టుకున్నట్లుగా మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు పగారే ప్రధానమంత్రిని అవమానించారని ఆరోపించిన బిజెపి కళ్యాణ్ జిల్లా యూనిట్ మండిపడింది. పగారేకు తగిన బుద్ధి చెప్పాలనుకున్న బీజేపీ నాయకులు అందుకు రెడీ అయ్యారు. పగారే సాధారణంగా దోంబివలి (తూర్పు)లోని మన్పాడ రోడ్డు సమీపంలో ఉదయం గడుపుతాడని అందిన సమాచారం మేరకు, జిల్లా బిజెపి చీఫ్ నందు పరాబ్, మండల అధ్యక్షుడు కరణ్ జాదవ్, సందీప్ మాలి, దత్తా మాలేకర్ వంటి పార్టీ కార్యకర్తలు మంగళవారం ఉదయం ఆయనను ముట్టడించారు.
Also Read:Bangalore : భర్త తనను సుఖపెట్టడం లేదని రూ. 2 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన భార్య..
తెల్లటి కుర్తా, పైజామా, పాలిష్ చేసిన నల్లటి బూట్లు ధరించిన పగారేను బిజెపి కార్యకర్తలు చుట్టుముట్టినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. బీజేపీ నాయకులు స్థానిక బట్టల దుకాణం నుంచి రూ. 5,000 విలువైన కొత్త చీరను తీసుకొచ్చి చీర కట్టారు బీజేపీ నాయకులు. బిజెపి కళ్యాణ్ జిల్లా అధ్యక్షుడు నందు పరాబ్ మాట్లాడుతూ.. “ఎవరైనా సోషల్ మీడియాలో బీజేపీ సీనియర్ నాయకులను కించపరచడానికి ప్రయత్నిస్తే, మేము కూడా అదే విధంగా స్పందిస్తాము. ఈ రోజు, పగారే ప్రధానమంత్రిని అగౌరవపరిచినందున బహిరంగంగా ఇలా చీరకట్టాల్సి వచ్చింది. అలాంటి వారికి ఇది ఒక హెచ్చరిక అని తెలిపారు.
मुंबई से सटे कल्याण में कांग्रेस नेता मामा पगारे ने पीएम मोदी का साड़ी वाला फोटो वायरल किया तो कल्याण भाजपा ने साड़ी पहनाकर दिया जवाब #Maharashtra #MaharashtraCongress #BjpMaharashtra pic.twitter.com/zMAREXoXJU
— Vinod Jagdale (@iamvinodjagdale) September 23, 2025