NTV Telugu Site icon

Bihar Crisis: అమిత్ షా ఇంట్లో కమలనాథుల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..!

Amithsha

Amithsha

ఢిల్లీ: బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. క్షణక్షణం మారుతున్న పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఇదే అంశంలోకి బీజేపీ అగ్రనేతలు ఎంట్రీ అయ్యారు. బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు.

Read Also: Chelluboina Venu: రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నాం..

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కమలనాథులు సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌తో సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై అమిత్‌ షాతో చర్చిస్తున్నారు. జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జేడీయూతో కలిసి వచ్చే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అంతేకాకుండా నితీష్ ఆధ్వర్యంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలన్నదానిపై కూడా బీజేపీ అగ్ర నేతలు చర్చిస్తున్నారు.

Read Also: Minister Amarnath: మేం దేనికైనా సిద్దం.. కలిసి‌ వస్తున్న పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దం..

ప్రస్తుతం ఉన్న సంకీర్ణ ప్రభుత్వం దాదాపు కూలిపోయినట్లుగానే తెలుస్తోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీష్ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి పదవికి శనివారం రాజీనామా చేసి ఆదివారం మరోసారి కాషాయ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నితీష్ ముఖ్యమంత్రిగా.. బీజేపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు నితీష్‌తో కలవబోతున్నట్లు సమాచారం.

Read Also: Ola E-Bike Service: కిలోమీటరుకు రూ. 5 మాత్రమే చార్జీ.. ఓలా కీలక ప్రకటన

బీహార్‌లో ప్రస్తుతం ఇలా..
బీహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. కనీస మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78కి, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎస్)కు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసే ఉన్నాయి. ఈ మూడు పార్టీల బలం 114 మంది ఉన్నారు. మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. జేడీయూ-బీజేపీ చేతులు కలిపితే మాత్రం 123 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ తమకే ఉందని ఆర్జేడీ అంటుంది. బీహార్‌లో చోటుచేసుకున్న ఈ సంక్షోభం ఎలా ముగుస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.