NTV Telugu Site icon

Sunil Deodhar: వైసీపీ సర్కార్ అన్నిటా విఫలం..ప్రతి గ్రామంలో పాదయాత్ర

Sunil Bjp

Sunil Bjp

ఏపీలో అధికార వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు బీజేపీ నేతలు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కీలక నేతలు పాల్గొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో వున్న రెండు కుటుంబ పార్టీలను ఓడించడానికి బీజేపీ కృషి చేస్తుంది, జనసేన బీజేపీతోనే వుంది..ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయింది..చంద్రబాబు పాలన నుంచి జగన్ పాలనలో వరకు చూస్తుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ప్రజల పరిస్థితి మారిందన్నారు.

Read Also: Jandhyala RaviShankar: జీవో 1పై మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం

అన్ని వనరులను దోచుకోవడం, హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా వైసీపీ మారింది.. హుండీ ఆదాయం ఇతర మతాలకు పంచి పెడుతున్నారు..పోరు యాత్ర-2 పేరుతో ప్రతి గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయబోతున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టానికి కృషిచేస్తాం అన్నారు సునీల్ దియోధర్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల పాలుకావడం, ఉద్యోగులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లో వైసీపీ ప్రభుత్వం వుంది..బీజేపీపై మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తూ టిడిపి,బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..వేల కోట్ల అవినీతికి పాల్పడిన వైసీపీ,టిడిపి వాళ్ళని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం బిజెపికి లేదన్నారు.

బీజేపీ MLC మాధవ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు జీతాలు రాలేదని గవర్నర్ ను వారు కలవడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తననానికి నిదర్శనం అన్నారు. అన్ని వ్యవస్థలు తమ చేతుల్లో తీసుకుని ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది..వైసీపీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం అన్నారు.

Read Also: Jandhyala RaviShankar: జీవో 1పై మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం

Show comments