NTV Telugu Site icon

Ponguleti Sudhakar Reddy: 15న ఖమ్మంకు అమిత్‌ షా.. బహిరంగ సభను విజయవంతం చేయాలి..

Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudhakar Reddy: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముఖ్యఅతిథిగా అమిత్‌ షా హాజరవుతారని వెల్లడించారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్‌ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. చైతన్యానికి మారు పేరు ఖమ్మం అని.. కేసీఆర్‌కు రాజకీయంగా దీటైన సమాధానం ఇస్తున్న పార్టీ బీజేపీ అని పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణ తొలి ఉద్యమం నడిచింది ఖమ్మం జిల్లాలోనే అని తెలిపిన పొంగులేటి.. అలాంటి జిల్లాలో అమిత్ షా మీటింగ్ పెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. అక్కడకి పోవాలా, ఇక్కడకి పోవాలా అని కొంత మంది వ్యాపారస్తులు ఉన్న ఈ జిల్లాలో, కమ్యూనిస్టు కంచుకోటలో, కాంగ్రెస్ ఇలాకాలో మనం‌ బహిరంగ సభ పెట్టుకుంటున్నామని కార్యకర్తలకు తెలిపారు. జరగబోయే సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివానం లేదని, గెలిచిన వారు అమ్ముడు పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..

ఎర్రటి ఎండలో యజ్ణం మొదలైందని.. పౌరుషానికి మారు పేరు ఈ నెల 15న జరగబోయే సభ అంటూ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. జరగబోయే ఈ సభతో ప్రత్యర్థులకు వణుకు పుట్టాలన్నారు, రాక్షస, అక్రమ, కుటుంబ పాలన విముక్తి కలిగే విధంగా మనం పని చెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను చిరుతపులితో పోల్చారు. చంద్రశేఖర్ రావు టక్కు టమార గోకర్న విద్యలు ఇక కుదరవన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Show comments