NTV Telugu Site icon

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబంపై కేసు..!

Karge

Karge

కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. మొదట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యాయపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్‌ఆర్‌ రమేష్‌ కర్ణాటక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మోసం, పత్రాలను ఫోర్జరీ చేయడం, ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు కుట్ర పన్నడం, ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనపరచుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Pakistan: పాకిస్థాన్‌లో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు.. 37 మంది మృతి

ఐదెకరాల భూమి కేసులో స్కామ్ ఆరోపణల్లో ఒకటి ప్రభుత్వ ఆస్తుల అక్రమ క్లియరెన్స్‌కు సంబంధించినది. అనుమానాస్పద పరిస్థితుల్లో సిద్ధార్థ్ విహార్ ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఖర్గే, మంత్రి ప్రియాంక్ ఎం. ఖర్గే, రాహుల్ ఎం. ఖర్గే, రాధాబాయి ఎం. ఖర్గే, రాధాకృష్ణ, మంత్రి ఎం.బి. పాటిల్, IAS అధికారి డాక్టర్ ఎస్. సెల్వకుమార్ పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Rajasthan: పోలీసుల ఎస్కార్ట్‌తో రాజస్థాన్ డిప్యూటీ సీఎం కుమారుడి రీల్ షూట్..

బిజెపి నాయకుడు తన వాదనలకు మద్దతుగా 394 పేజీల పత్రాలను సాక్ష్యంగా సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం.. రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థలు సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్‌కు ఆస్తులను కేటాయించాయి. 2014లో బెంగళూరులోని BTM 4వ స్టేజ్‌లోని 8,002 చ.మీటర్ (86,133 చ.అ.) CA ప్లాట్, సైట్ నంబర్ 05, బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) ద్వారా కేటాయించబడింది. అదనంగా 2024 మే 30న బగలూరులోని హైటెక్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పార్క్ యొక్క హార్డ్‌వేర్ సెక్టార్‌లోని ఐదు ఎకరాల భూమిని రాహుల్ ఎం ఖర్గేకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (KIADB) కేటాయించింది. ఈ భూకేటాయింపులు సక్రమంగా ఆమోదించబడలేదని.. ఫిర్యాదులో పేర్కొన్న వారి చర్యలపై సమగ్ర విచారణ జరపాలని రమేష్ కోరారు.