తెలంగాణలో 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలపై వారికే గ్యారంటీ లేదు అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెమటోడ్చి చేసింది 6 లక్షల 32 వేల కోట్లు అప్పు.. బీజేపీ చేసేది కొండంత.. కానీ చెప్పేది గోరంత.. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం 9 లక్షల 36 వేల కోట్లు ఇచ్చింది.. మేము సంపద పత్రం విడుదల చేస్తున్నాం.. మౌలిక వసతులపై కేంద్రం ఖర్చు చేసింది అని ఆయన చెప్పారు. ఆస్తులు పెరిగాయి.. ఆస్తుల విలువ పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం.. గెలిచిన ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపించడం లేదు.. వాళ్ళది అప్పుల చిప్ప మాది అక్షయ పాత్ర అంటూ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
Read Also: Visakha: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
ప్రధాని మోడీ వేసిన రోడ్ల వల్లే రాష్ట్రంలో భూములకు రేట్లు పెరిగాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా కేసీఆర్ సర్కార్ నిర్మించడం లేదు అని అన్నారు. మోడీ జెన్ కో ట్రాన్స్ కోకి 80 వేల కోట్ల రూపాయల అప్పు ఇస్తే కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు.. ఖజానా లేకపోవడంతో సీఎం రేవంత్ కళ్లలో ఆనందం కూడా లేదు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మొత్తం గికేసి పోయాడు అని సీఎం స్వయంగా చెప్పారు.. తెలంగాణ అబివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రజలను కోరారు.