ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు తీసుకెళతాం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎంవైఎస్ జగన్ తను ఉండి వచ్చిన ప్రాంతానికి వెళుతున్నాడని విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని కూడా స్కాంలలో వదల్లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి పార్కుకి, పార్లమెంటుకి వ్యత్యాసం తెలీదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 71వ జయంతి కార్యక్రమం జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి బీజేపీ నేతలు మాధవ్, భానుప్రకాష్ రెడ్డి, మధుకర్ జీలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Also Read: Gorantla Butchaiah Chowdary: ఇక నుంచి ఆ పరిస్థితులు ఉండవు: ఎమ్మెల్యే గోరంట్ల
భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… ‘మాజీ సీఎం జగన్ తను ఉండి వచ్చిన ప్రాంతానికి వెళుతున్నాడు. పిన్నెల్లిని పరామర్శించడం దేనికి జగన్. మాజీ సీఎం ఓదార్పు యాత్రలకే పరిమితం అవుతాడు. క్షమాపణ చెప్పి జగన్ జైలులో ఉన్న పిన్నెల్లి దగ్గరకి వెళ్ళాలి. ఈవీఎంలు పగులకొట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి. అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు ఏపీని తీసుకెళతాం. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్ధితి ఉంది. వెంకటేశ్వర స్వామిని కూడా స్కాంలలో వదల్లేదు. టీటీడీ ఛీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి గత ఐదేళ్లు ఎవరి కోసం పనిచేసారు.ఏడు కొండల్లో జరిగిన అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడతాం. రాహుల్ గాంధీకి పార్కుకి, పార్లమెంటుకి వ్యత్యాసం తెలీదు. ఇండియా కూటమి మొత్తం కలిపినా.. బీజేపీ మాత్రమే తెచ్చుకున్న ఎంపీ సీట్లకు సమానం కాదు’ అని అన్నారు.