NTV Telugu Site icon

Bhanu Prakash Reddy: సీఎంకే భద్రత లేకపోతే ఎలా..? అధికారులు నిద్రపోతున్నారా..?

Bhanu Prakash Reddy

Bhanu Prakash Reddy

Bhanu Prakash Reddy: నెల్లూరు జిల్లా : రాష్ట్రంలో సీఎం జగన్‌పై దాడి ఘటనపై విమర్శలు వెల్లవెత్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే వింత ఘటనలు జరుగుతున్నాయని.. ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ, జగన్ లకు కొత్త ప్లాన్స్ వస్తాయన్నారు. రాయి విసిరారా.. విసిరించుకున్నారా అనేది తెలియాల్సి ఉందన్నారు. హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి పై దాడి జరిగిందని.. సకల శాఖ మంత్రి హత్యాయత్నం జరిగిందంటున్నారన్నారు. సీఎంకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతుంటే అధికారులు నిద్ర పోతున్నారా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ను విధుల నుండి తప్పించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా కేంద్రంలో పాలన సాగిస్తోందన్నారు. విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారని.. మహిళలను గౌరవించలేని జగన్ కు ఓటు అడిగే హక్కు దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ 370 పార్లమెంట్ సీట్లు గెలవబోతోందని జోష్యం చెప్పారు.

Read Also: Rahul Gandhi: భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలన్నదే బీజేపీ ఆలోచన..