Indrasena Reddy : పేపర్ లీకేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేపర్ లీకేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదని, ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ కేవలం పోలీసులు వేసుకున్నదేనన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ కమిటీకి నోటీసులు అనే వార్త ప్రజలను ఫూల్స్ చేసేదే అని ఆయనా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వేసిన సిట్ లపై మాకు అసలు నమ్మకమే లేదని, సిట్ వేశారు అంటే ఆ కేసును పర్మనెంట్ గా పెండింగ్ లో పెట్టడమే అన్నారు. ఇప్పటి వరకు వేసిన ఏ సిట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదని ఆయన విమర్శించారు. టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ… కానీ ఆ సంస్థ చైర్మన్ ను కేసీఆర్ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడని, తీగలాగితే తన డొంక బయటపడుతుంది అనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారన్నారు.
Also Read : Nitish Kumar: రాజకీయ దురుద్దేశంతోనే రామ నవమి రోజున మత ఘర్షణలు..
Also Read
సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లే అధికారం టీఎస్పీఎస్సీ చైర్మన్ కు కూడా ఉండదని, క్వశ్చన్ పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తారో మెంబర్ సెక్రటరీ కి తప్ప ఎవరికీ తెలియదన్నారు. టీఎస్పీఎస్సీ ని చెప్పుచేతల్లో పెట్టుకుని తనకు కావాల్సిన విధంగా పనిచేయించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్ లో తెస్తే ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది.. కంప్యూటర్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని, పేపర్ లు టీఎస్పీఎస్సీ కి ఆన్లైన్ లో, సీల్డ్ కవర్, వాట్సాప్ లో తెప్పించారా.. ఎలా తెప్పించారని ఆయన ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ లో సెక్యూరిటీ విధానాలు పాటించారా లేదా అని ఆయన అన్నారు. సీక్రెట్ రూంలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా… ఉంటే వివరాలు బయటపెట్టాలని, సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాయాలన్నారు.
Also Read : Balakrishna and Boyapati : బాలయ్యతో యుద్ధం చేస్తున్న బోయపాటి
టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఒక్క రాష్ట్రపతి కి మాత్రమే ఉంటుందని, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇదే తరహాలో వ్యవహరించారన్నారు. డబ్బుకు కక్కుర్తి పడి కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు లేదని, టీఎస్పీఎస్సీ లో ఆర్టీఐ వేయబోతున్నాం… మాకు పరీక్షలు ఎంతమంది రాశారు, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయని తెలుసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు